గ్లోబల్ లీడర్స్ జాబితాలో మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్స్ సర్వేలో అత్యధికంగా 76శాతం ఆమోద రేటింగ్‌తో ప్రపంచ నాయకుల్లోనే ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. యూఎస్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ ప్రకారం భారతదేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు.
మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ కు 66 శాతం, స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ 58 శాతం ఆమోద రేటింగ్‌ను పొందారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు 37 శాతం మంది, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 31 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి 25 శాతం మంది, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు కేవలం 24 శాతం మంది ప్రజల ఆమోదం లభించింది.