ఈనెల 14న రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సాయం జమ కానుంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. దేశ వ్యాప్తంగా సుమారు 9.5 కోట్ల మంది రైతులకు రూ.19వేల కోట్లకు పైగా నగదును అందజేస్తారు. లబ్ధిదారులైన ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఈ ఏడాది మొదటి విడత ఆర్థిక సాయాన్ని కేంద్రం ఇవ్వనుంది. ఈనెల 14న ఉ.11 గంటల తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. రైతులతో ఆయన ఆన్ లైన్ ద్వారా మాట్లాడతారు. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి రూ.6వేల చొప్పున వారికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement