Thursday, November 21, 2024

రాష్ట్రాలు టీకాల వృథాను అరికట్టాలి: మోదీ

దేశంలో కరోనా టీకాల సరఫరాను పెంచేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాలు టీకాలు వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తే వ్యాక్సిన్ వృథాను అరికట్టొచ్చని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమాల కోసం మనం చేసే ప్రయత్నాల్లో లోపాలుండకూడదని చెప్పారు. ఇక కరోనా కట్టడిపై అన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో ఇవ్వాళ ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పోరులో అధికారులే ఫీల్డ్ కమాండర్లని ప్రధాని అన్నారు. మహమ్మారి సమయంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు.. భవిష్యత్ లో మరిన్ని క్లిష్టమైన సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడతాయన్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ వస్తే మెరుగైన కార్యాచరణ చేసేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement