ప్రధాని మోదీ ముఖ్య సలహాదారుడు పీకే సిన్హా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్లే సిన్హా రాజీనామా చేశారని తెలుస్తోంది. అనారోగ్య కారణాల నేపథ్యంలో విధులకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయన భావిస్తున్నారని పీఎంవో కార్యలయంలోని ఓ అధికారి వెల్లడించారు. పీకే సిన్హా 1977 బ్యాచ్ కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత ఆయనకు కేబినెట్ సెక్రటరీగా సేవలందించారు. 2019లో రిటైర్ అయిన తర్వాత ఆయన కోసం ప్రధాని కార్యాలయంలో ఓఎస్డీ పేరుతో ప్రత్యేకంగా ఓ పదవిని సృష్టించారు.
మోదీ సలహాదారుడు రాజీనామా
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement