Monday, November 18, 2024

Varanasi : కాశీలో పూజ‌లు నిర్వ‌హించిన ప్ర‌ధాని మోదీ

ఇవాళ ప్ర‌ధాని మోదీ వార‌ణాసిలో నామినేష‌న్ వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కాశీలో ప్ర‌ధాని పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. నామినేషన్‌ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. దీని తర్వాత ప్రధానమంత్రి కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు.

- Advertisement -

వారణాసి నియోజకవర్గం నుంచి మరో సారి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ..ఈ సందర్భంగా కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ వేశాక, రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు ప్రధాని మోడీ.

ప్రధాని మోదీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఎన్డీయే నేతలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతల సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాసిలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. దీని తర్వాత, ప్రధాని వారణాసి లోక్‌సభ స్థానం నుండి ఉదయం 11:40 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం ప్రధాని మోడీ జార్ఖండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement