ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ప్రధాని ఇ సిమారియాకు వెళ్తున్నారు. ముర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఆయన వస్తుండటంతో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. సభ వేదికను ఎస్‌పీజీ స్వాధీనం చేసుకుంది. వేదిక పైకి ఎవరూ ప్రవేశించకుండా నిషేధించారు. కాగా, స్థానిక మీడియా నుంచి ఏ ఒక్కరు కూడా వేదికను సందర్శించడానికి అనుమతించడం లేదన్నారు. హెలిప్యాడ్ దగ్గర బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత సభా వేదిక వద్దకు బయలుదేరుతారు. వేదికపై ప్రధానికి రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, ఛత్రా బీజేపీ అభ్యర్థి కాళీచరణ్ సింగ్, హజారీబాగ్ అభ్యర్థి మనీష్ జైస్వాల్ స్వాగతం పలుకుతారు. స్వాగత అనంతరం ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.