మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు.
ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే జీ7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సు రేపు (జూన్ 14) జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా, ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించనున్నారు.