Monday, November 18, 2024

National : వందే భారత్ ట్రైన్‌ను వ‌ర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా రూ.85 కోట్ల కొత్త ప్రాజెక్టులకు మంగళవారం ప్రధాని మోడీ, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 గతిశక్తి కార్గో టెర్మనల్‌ను ప్రారంభించారు. విశాఖ- సికింద్రాబాద్ మధ్య మరో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మోడీ వర్చువల్‌గా మాట్లాడారు. ఇండియన్ రైల్వే మరింత అభివృద్ధి చెందాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. మన రైల్వేను మరింత ఆధునీకీకరిస్తాం.. నాది గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్లలో దేశీయ ఉత్పత్తుల అమ్మకం బాగా పెరగాలని మోడీ ఆకాంక్షించారు. దేశం నలుమూలల నుండి ప్రతిష్టాత్మక అయోధ్యకు రైళ్లు నడుపతున్నామని తెలిపారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు మూడు వందే భారత్ సర్వీసులు అందుబాటులో ఉండగా.. తాజాగా ప్రధాని మోడీ మరో వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందేభారత్ రైలు సర్వీసుల సంఖ్య నాలుగుకు చేరింది. తాజాగా ప్రధాని మోడీ ప్రారంభించిన వందేభారత్ సికింద్రాబాద్-విశాఖ రూట్‌లో నడువనుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలో మరో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రావడంతో రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement