భోపాల్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో పర్యటించి.. రాణి కమలాపతి రైల్వేస్టేషన్ నుంచి 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. తద్వారా బీహార్, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలకు తొలిసారిగా వందేభారత్ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి..
ఈ కొత్త రైళ్లకు 8 బోగీలు ఉంటాయి. ఇవి 5 కొత్త రూట్లలో అంటే.. ముంబై-గోవా, ఇండోర్-భోపాల్, పాట్నా-రాంచీ, జబల్బూర్-రాణీ కమలాపతి, బెంగళూరు-హుబ్బళి-ధార్వాడ్ మధ్య రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లతో ఇప్పటివరకూ లాంచ్ చేసిన వందేభారత్ రైళ్ల సంఖ్య 23కి చేరనుంది