Sunday, November 17, 2024

PM Modi | ఎయిమ్స్ లో డ్రోన్ సేవ‌లు

  • లాంచనంగా ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ
  • ఏపీలోని మంగ‌ళ‌గిరి, తెలంగాణ‌లోని బీబీన‌గ‌ర్
  • ఎయిమ్స్ లోని డ్రోన్స్ సేవ‌ల‌కు శ్రీకారం
  • రోగులకు మందులు డ్రోన్ ద్వారా ఇంటికే మందులు
  • అలాగే ప‌రీక్ష‌లు అవ‌స‌ర‌మైన శాంపిల్స్ సైతం డ్రోన్స్ ద్వారానే


హైద‌రాబాద్ – ఎపి, తెలంగాణ‌లోని ఎయిమ్స్ లో నేటి నుంచి డ్రోన్స్ సేవ‌లు పారంభ‌మ‌య్యాయి.. ప్ర‌ధాని మోదీ ఢిల్లీ నుంచి ఈ సేవ‌ల‌ను వీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా నేడ ప్రారంభించారు.. ఎపిలోని మంగ‌ళ‌గిరిలోనూ, తెలంగాణ‌లో బీబీ న‌గ‌ర్ లో ఎయిమ్స్ హాస్ప‌టల్స్ లో ఈ డ్రోన్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.

ముందుగా మంగళగిరి ఎయిమ్స్ లో డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష చేపట్టారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్సీ వరకూ డ్రోన్ ను అధికారులు పంపించారు. మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్క డ్రోన్ తిరిగొచ్చింది.

ఇక ఆ త‌ర్వాత బీబీనగర్ ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రధాని శ్రీకారం చుట్టారు. కాగా, . టీబీ అనుమానితులు పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో సేకరించిన శాంపిల్స్ ఆసుపత్రికి పంపేందుకు చాలా సమయం పడుతోంది. దీంతో ప్రాథామిక ఆరోగ్య కేంద్రాల‌లో శాంపిల్స్ సేకరించి వాటిని డ్రోన్ సాయంతో జిల్లా కేంద్ర ఆసుపత్రులకు పంపించనున్నారు. అక్క‌డ నుంచి ఎయిమ్స్ ప‌రీక్ష‌ల రిపోర్ట్ లు ఎయిమ్స్ కు పంప‌నున్నారు.. అలాగే అవ‌స‌ర‌మైన రోగుల‌కు మందులను కూడా డ్రోన్ల ద్వారా అందించ‌నున్నారు.

- Advertisement -

51 వేల మందికి ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అంద‌జేత ….
ఉపాధి మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎంపికైన 51,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలందరికీ ధన్‌తేరస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైనదని ప్ర అన్నారు. 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీరాముడు అయోధ్యలోని తన ఇంట్లో కూర్చున్నార‌ని తెలిపారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడచిపోయాయని, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని ప్రధాని మోదీ అన్నారు. అటువంటి ప్రత్యేకమైన, ప్రత్యేకమైన, గొప్ప దీపావళిని చూసేందుకు మనమందరం చాలా అదృష్టవంతులమ‌న్నారు. ఈ పండుగ వాతావరణంలో ఈ శుభదినాన ఉపాధి మేళాలో 51 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తున్నాన‌ని చెప్పారు.

భారత ప్రభుత్వంలో దేశంలోని లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది యువతకు నియామక పత్రాలు ఇచ్చామ‌ని చెప్పారు. హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 26 వేల మంది యువతకు ఉద్యోగాల బహుమతి లభించింద‌ని మోదీ చెప్పుకొచ్చారు.

3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం…
త‌మ ప్ర‌భుత్వం గ్రామీణ మహిళలకు కొత్త ఉపాధిని, స్వయం ఉపాధిని కల్పించిందన్నారు మోదీ. గత దశాబ్దంలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరార‌న్నారు.. దీంతో 10కోట్ల మంది మహిళలు స్వయం ఉపాధి ద్వారా సంపాదించడం ప్రారంభించారని చెప్పారు. వారికి ప్రభుత్వం పూర్తి మద్దతునిచ్చిందన్నారు. వీరిలో 3కోట్ల మంది మహిళలను లఖపతి దీదీగా మార్చాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంద‌ని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 1.25 కోట్ల మంది మహిళలు లఖపతి దీదీలుగా మారార‌ని, వారి వార్షిక ఆదాయం రూ.1లక్ష దాటింద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement