ఢిల్లీలో చిన్నపిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ప్రమాదం ప్రధాని మోదీ ద్రిగ్బాంతి వ్యక్తి చేశారు.
“ఢిల్లీలోని ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోడీ ఎక్స్‌లో రాసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
శనివారం రాత్రి 11:30 గంటలకు బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్‌లో మంటలు చెలరేగాయి, వెంటనే పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు మరణించగా, 5 మంది మరొక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆసుపత్రి యజమాని నవీన్ కిచ్చిగా గుర్తించారు, అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర బాధాకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ప్రమాదంలో తమ అమాయక పిల్లలను కోల్పోయిన వారికి మేమంతా అండగా ఉంటాం. ఘటనా స్థలంలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు, ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టమని ఆయన తెలిపారు.