ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది అలాగే ఈ ఏడాది కూడా తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు. 2020లో రూ. 2.85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ. 22 లక్షలు పెరిగి.. 3 కోట్ల 7 లక్షల రూపాయలకు కు చేరింది. ఈ మేరకు తన తాజా డిక్లరేషన్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది.
మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ లక్షా 48 వేల రూపాయలు.2014లో ప్రధాని అయినప్పటినుంచి ఇప్పటివరకు మోదీ ఎలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదు.