Saturday, November 23, 2024

గుజరాత్ లో తుపాను ఎఫెక్ట్: వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

తౌతే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తౌతే విధ్వంసానికి గురైన గుజరాత్ కు రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. గుజరాత్ లో తుపాను నష్టంపై అంచనాకు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా తౌతే తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను గుజరాత్ లోని పోరుబందర్, మహువా మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఇది పెను తుపాను స్థాయిలో ఉండడంతో విధ్వంసం కూడా అదే స్థాయిలో జరిగింది. గుజరాత్ లోని 12 జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. దీని ప్రభావంతో 45 మంది మరణించారు. ఒక్క ఆమ్రేలీ జిల్లాలోనే 15 మంది మృతి చెందారు. అపార ఆస్తినష్టం సంభవించింది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement