Tuesday, November 26, 2024

జూన్‌ 5 నుంచి 15 వరకు.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాచురేషన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో కొత్త రైతులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 5 నుంచి 15 వరకు పీఎం కిసాన్‌ సాచురేషన్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రయోజనాలను పొందేందుకు ఈడ్రైవ్‌ ఉపయోగపడనుంది. అన్నదాతలు ఈకేవైసీని పూర్తి చేసుకోవడంతోపాటు భూమి వివరాలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింకు చేసుకోవచ్చు. తమ వివరాలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6వేల ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఏటా మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 16 విడతల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలు పూర్తయింది. ఇకపై 17వ విడత పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement