Friday, November 22, 2024

PM Kisan Samman Nidhi – కేంద్రం నుంచి రైతు సాయం నిధులు విడుద‌ల

రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల విషయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా సుమారు 9.3 కోట్ల మంది రైతులకు లబ్ది పొందుతున్నారు. ఇక ముచ్చటగా మూడవసారి ఏర్పడిన నరేంద్ర మోదీ నూతన సర్కార్ 17వ విడత సాయాన్ని ఇటీవలే విడుదల చేసింది. సుమారు రూ.20,000 కోట్లు మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో మొదటి సంతకంగా విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు ఖాతాల్లో పడ్డాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement