గ్రహానికి ఉండాల్సిన లక్షణాలేవీ ప్లూటోకు లేవని 16 ఏళ్ల కిందట ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పునరాలోచించాల్సి ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది. తనలో దాగిన రహస్యాలలోకి మనల్ని లాగగల శక్తి ప్లూటోకు ఉన్నట్లు కనిపిస్తోంది. సౌరవ్యవస్థలో మరెక్కడా కనిపించని మంచుతో కూడిన అగ్నిపర్వతాల ఆనవాళ్లు దీని ఉపరితలంపై కనిపించడమే ఇందుకు కారణం. న్యూ హారిజన్స్ మిషన్‌కు చెందిన శాస్త్రజ్ఞుల బృందం, మంచుతో నిండిన గ్రహం ఉపరితలం కిందనుంచి వచ్చిన పదార్థం ద్వారా ఏర్పడిన కొండలు, గుట్టలతో కూడిన పెద్దపెద్ద గోపురాలను గుర్తించింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఈ సుదూర గ్రహం ఉపరితలం నుంచి దాదాపు 100-200 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ దిగువన నీటి సమృద్ధమైన సముద్రం ఉండివుండవచ్చని సూచిస్తుంది.
రైట్ మోన్స్, పిక్కార్డ్ మోన్ అని పిలువబడే రెండు పెద్ద మట్టిదిబ్బల ప్రాంతాన్ని హారిజన్ ్స మిషన్ చిత్రీకరించింది. దీనిని క్రయోవోల్కనోలుగా పేర్కొంటారు. క్రయోవోల్కానిక్ ప్రాంతంలో 1-7 కిలోమీటర్ల పొడవు, 30-100 లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వరకు పెద్ద గోపురాలు ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు కలిసిపోయి మరింత సంక్లిష్టమైన నిర్మాణాలను ఏర్పరుస్తాయి అని ప్రాజెక్టు డిప్యూటీ సైంటిస్టు డాక్టర్ కెల్సి సింగర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..