దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని యువత అల్లర్లు చేస్తున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకం వల్ల అగ్నివీరులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పారశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement