Monday, January 27, 2025

TG | రాజ్‌భవన్‌లో ఆహ్లాదకరంగా ‘ఎట్ హోం’

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో “ఎట్‌ హోం” కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్పీకర్ ప్రసాద్ కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, పలువురు ప్రముఖులు హాజరై వేడుకను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చారు.

ఈ సంద‌ర్భంగా ప్రజా పాలనలో విశేష కృషి చేసిన అధికారులకు, పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, సంస్కృతి, క్రీడా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు రాజ్‌భవన్ చరిత్రలో తొలిసారిగా “గవర్నర్ ఎక్సలెన్స్” 2024 పేరిట నెలకొల్పిన అవార్డులను ‘ఎట్‌ హోమ్’ కార్యక్రమంలో అందజేశారు.

- Advertisement -

ఆయా రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను దుశ్చర్ల సత్యనారాయణ, అరెకపూడి రఘు, దీప్తి జివాంజి, కృష్ణభారతి, ప్రొ.పాండురంగారావు గవర్నర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న ధ్రువాంశ్ సంస్థ, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ లు అవార్డులకు ఎంపిక కాగా వాటి ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. అలాగే, ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి “స్పెషల్ లైఫ్ టైమ్ అవార్డు”ను అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement