Sunday, November 24, 2024

వేంకటేశ్వరస్వామి వేషధారణ.. గంగమ్మతల్లికి మొక్కు తీర్చుకున్న ఎంపీ గురుమూర్తి

తిరుపతి గంగమ్మ జాతర కు తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉంది. ఏటా వారం రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలలో భాగంగా రకరకాల వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ళ విరామం తర్వాత ప్రస్తుతం ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా టీటీడీతో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పీఠాధిపతులు అమ్మవారికి సారెలు సమర్పిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా తిరుపతి లోక్ సభ సభ్యుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి గంగమ్మ తల్లి సోదరుడుగా భక్తులు భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణతో ఆదివారం మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement