ప్రభన్యూస్ : బండి కాదు మొండి ఇదీ.. సాయం పట్టండీ.. అని అప్పుడెప్పుడో తెలుగు సినిమాలో ఓ పాట వచ్చింది. మొరాయించిన వాహనాలను తోసుకుంటూ వెళ్లినపుడు సరదాగా ఈ పాటని మననం చేసుకోవడం మామూలే. కానీ అలా ఓ విమానం కూడా టేకాఫ్ తీసుకోవడానికి మొరాయించింది. కనీసం అంగుళమైనా కదల్లేదు. చివరకు ప్రయాణీకులే దిగి నెట్టుకుంటూ రన్ వే పక్కకు జరిపారు. మిగతా విమానాల రాకపోకలకు ఆటంకం లేకుండా ఉండేందుకు మరి నెట్టక తప్పలేదు. ఈ సంఘటన మన పొరుగునే ఉన్న నేపాల్ లో చోటు చేసుకుంది.
తారా గ్రూప్ నకు చెందిన విమానం నేపాల్ లోని కోల్టీ బజురా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూండగా వెనక టైర్ పేలిపోయింది. దీంతో అతికష్టంమీద ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే ల్యాండ్ అయిన తరువాత ఒక్క అంగుళం కూడా కదల్లేదు. నేపాల్ లో ఏకైక విమానాశ్రయం, ఏకైక రన్ వే ఉండటంతో మరో విమానం ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకుండా పోయింది. అప్పటికే ల్యాండింగ్ కోసం వేచి చూస్తూ చక్కర్లు కొడుతూండటంతో విధిలేని పరిస్తితుల్లో ప్రయాణికులు, భద్రతా సిబ్బంది ఈ చిన్ని విమానాన్ని నెట్టుకుంటూ ఓ పక్కకు జరిపారు. ఈ దృశ్యాన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital