విమానాల ప్రవేశంపై నిషేధాజ్ఞలు ఉన్న అమెరికా అధ్యక్ష భవనం గగనతలంపై ఒక చిన్న విమానం అనుమానస్పదంగా చక్కర్లు కొట్టడంతో అధ్యక్షుడు జో బిడెన్ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. తక్షణం అధ్యక్షుడు జో బిడెన్, ఆయన సతీమణి ఫస్ట్‌లేడీ జిల్ బిడెన్‌లను భవనం నుంచి ఖాళీ చేయించింది. ఈ ఘటన డెలావేర్ స్టేట్‌లోని రెహోబాత్ బీచ్‌లో ఉన్న ప్రెసిడెంట్ బీచ్‌హౌస్‌లో చోటు చేసుకుంది.
ఈ ఘటన కేవలం సంకేతాల పొరపాటు కారణంగానే జరిగిందని, అందువల్లనే చిన్న విమానం అధ్యక్ష భవనంపై చక్కర్లు కొట్టిందని యుఎస్ సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అధ్యక్షుడు, ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.