Tuesday, October 22, 2024

Thailand | కూలిన విమానం.. రంగంలోకి రెస్క్యూ సిబ్బంది

థాయ్‌లాండ్‌లో విమాన ప్రమాదం జరిగింది. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని ప్రధాన విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. ఈ చిన్న విమానం తూర్పు థాయ్‌లాండ్‌లోని ట్రాట్ ప్రావిన్స్‌కు వెళుతుండగా… సువర్ణభూమి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌తో సంబంధాన్ని కోల్పోయి చాచోంగ్‌సావోలోని అడవిలో కూలిపోయింది.

అయితే, ఈ విమానం కూలిపోయినట్లు సమాచారం అందడంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. విమానంలో ఏడుగురు పర్యాటకులు, ఇద్దరు సిబ్బందితో సహా 9 మంది మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. పర్యాటకులు జాడ కోసం వెతుకుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement