ఒమిక్రాన్‌పై యుద్ధం చేస్తున్న తరుణంలో, ముంబై నగరాన్ని ఉగ్రముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఖలిస్తానీ విద్రోహశక్తులు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేసింది. ముందుజాగ్రత్త చర్యగా, ముంబై పోలీసులు డిసెంబర్ 31న తమ సిబ్బంది అందరికీ సెలవులు, వీక్లీ ఆఫ్‌లు రద్దు చేశారు.
నగరంలో ఖలిస్తాన్ శక్తులు తీవ్రవాద దాడులకు పాల్పడవచ్చని సమాచారం అందిందని, ముంబై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బాంద్రా చర్చ్‌గేట్, కుర్లా వంటి అన్ని ప్రధాన స్టేషన్‌లలో గట్టి భద్రతను మోహరించారని ముంబై రైల్వే కమిషనర్ క్వాయిజర్ ఖలీద్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.. #AndhraPrabha #AndhraPrabhaDigital