Friday, November 22, 2024

Big Story | ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ప్లేస్​మెంట్స్​.. అగస్టులో మొదటి నియామక ప్రక్రియ

అమరావతి,ఆంధ్రప్రభ: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న, చదవాలనుకుంటున్న విద్యార్ధులకు ఓ శుభవార్త. ఇక నుండి ఈ కాలేజీల్లోనూ ఉద్యోగ ని యామకాల కోసం క్యాంపస్‌ ప్లేస్మెంట్స్‌ను నిర్వహించబోతున్నారు. మొదటిసారిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ ప్రక్రియ జరగబోతోంది. జులై-అగస్టు మాసంలో ప్లేస్మేంట్స్‌ నిర్వహించేందుకు కాలేజీ విద్య కమిషనరేట్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పది సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సంప్రదాయ కోర్సులతోపాటు రీస్ట్రక్చర్డ్‌ కోర్సుల పేరుతో మార్కెట్‌కు అసరమైన కోర్సులను కూడా ప్రవేశపెట్టారు.

ఉదాహారణకు బిబిఏ కోర్సులో హాస్పటి ల్‌ సర్వీసెస్‌ మేనేజేమెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, బిఎస్సీలో సెరీకల్చర్‌, అక్వాకల్చర్‌ లాంటి మార్కెట్‌కు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఈ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసుకుంటున్న విద్యార్ధులకు జులై-అగస్టులో ప్లేస్మెంట్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివిన విద్యార్ధుల కోసం కాలేజీ ఎడ్యుకేషన్‌ జాబ్‌ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్దులు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఉద్యోగాల కోసం తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అలాగే వారి వివరాలన్నీ ఇస్తే ఆటోమేటిక్‌గా రెజ్యూమ్‌ తయారయి వచ్చేస్తుంది. అలాగే ఉద్యోగులు కావాలనుకునే సంస్థలు కూడా ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

- Advertisement -

10 సంస్థలతో ఎంఓయు

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు చూపించేందుకు కాలేజీ విద్య కమిషనరేట్‌ 10 సంస్థలతో ఇప్పటికే ఎంఓయు కుదుర్చుకుంది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక కంపెనీలుగా 36 సెక్టోరియల్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇండస్ట్రీకి, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించి కాలేజీల నుండి విద్యార్ధులను నైపుణ్యులుగా తయారు చేసి, వారికి ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇప్పించడం ఈ సెక్టోరియల్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌ ఉద్ధేశ్యం. క్యాపిటల్‌ గూడ్స్‌ స్కిల్‌ కౌన్సిల్‌, ఎలక్ట్రానిక్‌ స్కిల్‌ కౌన్సిల్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఇలా దాదాపు 17 సెక్టార్లకు సంబంధించిన స్కిల్‌ కౌన్సిల్స్‌ ఉన్నాయి.

వీటిలో పది సంస్థలతో కాలేజీ విద్య కమిషనరేట్‌ ఒప్పందాలు చేసుకుంది. విద్యార్ధులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాక ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కోర్సులను రీస్ట్రక్చర్‌ చేయడం, ఆ కోర్సులకు అనుగణంగా కంటెంట్‌ను జనరేట్‌ చేయడం, ఆ కోర్సులు చెప్పగలిగే విధంగా అధ్యాపకులను సిద్దం చేయడం, కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులకు ఇంటెర్నషిప్‌ను అందించడం, ఆ తర్వాత ఆసక్తి ఉన్న విద్యార్ధులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడం ఈ ఒప్పందాల్లో రాసుకున్న విషయాలు. ఈ పది సంస్థలతోనే కాక నాస్కామ్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థలతోనూ ఎంఓయులను కుదుర్చుకోబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement