తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద న్యాయవాదులను ఆదుకోవాలని హైకోర్టులో పిల్ ధాఖలైంది. ఈ మేరకు న్యాయవాది రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేశారు. లాక్ డౌన్ సమయంలో పేద న్యాయవాదులకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి లోన్లు మంజూరు చేయాలని పిటిషనర్ కోరారు. లాక్‌డౌన్ కారణంగా న్యాయవాదులు, కోర్టుల్లో పనిచేసే క్లర్కులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల కోసం కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
న్యాయవాదులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement