Monday, January 13, 2025

Piracy – గేమ్ ఛేంజ‌ర్ హెచ్ డి ప్రింట్ లీక్ … సైబ‌ర్ సెల్ కు ఫిర్యాదు

హైద‌రాబాద్ – సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘గేమ్ చేంజర్ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయినట్టు గుర్తించారు. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని మేకర్స్ ఆరోపిస్తున్నారు.

‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయని వెల్లడించారు. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారని, ‘గేమ్ చేంజర్’ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారని ఓ ప్రతినిధి ఒక ప్రకటనలో వివరించారు. ఇక విడుదలైన తర్వాత హెచ్ డీ ప్రింట్ లీక్ చేయడమే కాకుండా టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారని తెలిపారు.

- Advertisement -

కాగా, తమను బెదిరించి, పైరసీ ప్రింట్ లీక్ చేశారంటూ 45 మంది మీద గేమ్ చేంజర్ సినిమా టీమ్ ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌ పీఎస్ లో కంప్లైంట్ చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి ‘గేమ్ చేంజర్’ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉందని మేకర్స్ పేర్కొన్నారు. గేమ్ చేంజర్ చిత్రబృందం నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement