Tuesday, December 10, 2024

Pink Ball Test – టీమ్ ఇండియా ప్లాప్ షో…

అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 44.1 ఓవర్లలో 180 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో భారత్ ను కుప్పకూల్చాడు. ఈ డే/నైట్ పింక్ బాల్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఇన్నింగ్స్ తొలి బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ఖాతా తెరవకుండానే మిచెల్ స్టార్క్ బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, శుభ్ మాన్ గిల్ జోడీ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించింది.

అయితే, 12 పరుగుల తేడాతో భారత్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్ ల వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేయగా… కోహ్లీ 7 పరుగులకే వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 21 పరుగులు చేయగా… మిడిలార్డర్ లో వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డాడు. 23 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసిన రోహిత్ శర్మ చివరికి స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇక, తొలి టెస్టులో తన డైనమిక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న తెలుగుతేజం నితీశ్ రెడ్డి మరోసారి మెరిశాడు. లోయరార్డర్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి బౌండరీల మోత మోగించాడు. నితీశ్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేయడం విశేషం. నితీశ్ కు తోడు మరో ఎండ్ లో రవిచంద్రన్ అశ్విన్ 22 పరుగులు చేయడంతో టీమిండియాకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చివర్లో హర్షిత్ రాణా (0), జస్ప్రీత్ బుమ్రా (0) డకౌట్ అయ్యారు. నితీశ్ రెడ్డి ఆఖరి వికెట్ గా వెనుదిరగడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టార్క్ బౌలింగ్ లో లెంగ్త్ బాల్ ను నితీశ్ లాంగాఫ్ లో సిక్సర్ గా మలిచిన తీరు హైలైట్ గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement