న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పింగళి వెంకయ్య తెలంగు జాతి గర్వ పతాక అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వారసులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బుధవారం న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో కలిశారు. కిషన్ రెడ్డితో కలిసి ఉపరాష్ట్రపతి వారిని శాలువాతో సత్కరించారు.
భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైనదని వెంకయ్య అన్నారు. ఆయన కార్యదీక్ష, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పింగళి సుశీల దశరథ రామన్, పింగళి వెంకయ్య దశరథ రామన్ (ముని మనుమడు), ఘంటసాల గోపీకృష్ణ, ఘంటసాల వాసుదేవ నరసింహన్, ఘంటసాల కృష్ణ ప్రవీణ్ తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి వారిని తన నివాసానికి పిలిచి ఘనంగా సన్మానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.