భారత్ సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్ లాంచర్ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో.. పినాకా రాకెట్ వ్యవస్థకు చెందిన ఎక్స్‌టెండెడ్ రేంజ్ (పినాక-ఈఆర్) మల్టి బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. పినాక-ఈఆర్ అనేది గత దశాబ్ద కాలంగా భారత్ సైన్యంతో సేవలో ఉన్న పినాకా మునుపటి వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని డీఆర్‌డీఓ తెలిపింది.
పినాక – ఈఆర్ రాకెట్ లాంచర్ వ్యవస్థ సాంకేతికతను డీఆర్‌డీఓకు చెందిన ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఏఆర్‌డీఈ), పూణలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. డీఆర్‌డీఓ నుంచి ఈ సాంకేతికతను పొందిన ఓ ప్రైవేటు కంపెనీ.. రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కొత్తగా ఉద్భవిస్తున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించినట్టు డీఆర్‌డీఓ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital