కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసం, హింసవల్ల ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అడ్వకేట్ విశాల్ తివారీ ఈ పిల్‌ను దాఖలు చేశారు.
యూపీ, తెలంగాణ, బీహార్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలకు కూడా ఈ విషయంలో నోటీసులు ఇవ్వాలని కోరారు. నష్టాన్ని అంచనావేసే సిట్‌లో నిపుణులు ఉడాలని, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి ఈ కమిటీకి నేతృత్వం వహించేలా చూడాలని కోరారు. విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులపై కేసులు పెట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.