Tuesday, November 19, 2024

ధాన్యం కొనుగోలుపై హైకోర్టులో పిల్‌

ప్ర‌భ‌న్యూస్ : ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్‌ పిల్‌ను దాఖలు చేశారు. ధాన్యం సేకరణ కోసం ఎఫ్‌సీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న పిటిషనర్‌. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న పిటిషనర్‌. ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడంతో రైతాంగం నష్టపోతున్నారంటూ న్యాయవాది అభినవ్‌ కోర్టుకు తెలిపారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోళ్ళు లేక నష్టపోతుండటంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కొంత మంది ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఆదేశించాలని ప్రభుత్వంతో పాటు ఎఫ్‌సీఐని ఆదేశించాలని కోరారు. పంట కొనుగోళ్ళ కోసం చేపట్టిన చర్యలు తదితర వివరాలను తెలియజేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎఫ్‌సీఐలకు ఆదేశించిన హైకోర్టు విచారణను డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement