Thursday, November 21, 2024

PIL – పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వం – విచార‌ణ‌కు సుప్రీం నో

న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు రాకరించింది. జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాలతో కూడిన ధర్మాసనం నేడు ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఉద్దేశం కోర్టుకు తెలుసని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీన్ని విచారించేందుకు నిరాకరిస్తున్నట్లు పిటిషన్‌దారు అయిన న్యాయవాది జయ సుకిన్‌కు ధర్మాసనం తెలిపింది.

దీంతో తాను ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటానని పిటిషన్‌దారు విజ్ఞప్తి చేయగా ధర్మాసనం అంగీకరించింది. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్‌దారు అంతకుముందు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 28న ప్రధాని మోడీపార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. దీనికి తాము హాజరుకాబోమంటూ ఇప్పటికే 20 ప్రతిపక్ష పార్టీలు ప్రకటన విడుదల చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement