పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. మద్యం సేవించి పాఠశాలకి రావడమే కాదు..తాగిన మైకంలో విద్యార్థినుల ముందు దుస్తులను కూడా విప్పాడు. ఈ సంఘటన కొట్రాలోని ఖజురియా స్కూల్ లో చోటు చేసుకుంది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ దేవిలాల్ మీనా మద్యం సేవించి స్కూల్ కి వచ్చాడు. అయితే ప్రిన్సిపాల్ అలోక్ శర్మ, ఇతర ఉపాధ్యాయులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో అతను ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్ ని గాయపరచాడు. అందరి ముందు దుస్తులను ఒక్కొక్కటిగా తీయడం ప్రారంభించాడు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో 200 మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. టీచర్‌ను ఈ స్థితిలో చూసిన పలువురు విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడ ఉన్న జనాల్ని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. మరింత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకోగా, వారిని కూడా కొట్టడం ప్రారంభించాడు.
దాంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీచర్ మద్యం సేవించి పాఠశాలలో పలుమార్లు వీరంగం సృష్టించినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా పోలీసులు అతడిని పట్టుకుని కొంత సమయం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఇప్పుడైనా అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ అలోక్ శర్మ సీబీఈవో, డీఈఈవో, జిల్లా విద్యాశాఖాధికారికి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు రాజస్థాన్ బాలల కమిషన్‌కు కూడా చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..