దిల్లీ : సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులకు అనూహ్య ఘటన ఎదురైంది. కొందరు గుర్తుతెలియని దుండగులు అధికారులపై దాడులకు దిగారు. ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈమేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈడీ లోని హై- ఇంటెన్సిటీ యూనిట్ అధికారులు దేశవ్యాప్తంగా సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈనేపథ్యంలో దిల్లీలో బిజ్వాసన్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు దుండగులు ఫర్నీచర్‌తో అధికారులపై భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యూఆర్ కోడ్, పిషింగ్, పార్ట్‌టైమ్ జాబ్స్ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌క్రైమ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికితీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు.