దేశంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే ఒకటి. ఈ డిజిటల్ పేమేంట్ ప్లాట్‌ఫాం కొత్త మైలురాయిని అధిగమించింది. ఫోన్ పే ద్వారా జరిగే వార్షిక చెల్లింపుల విలువ 84 లక్షల కోట్ల(1 ట్రిలియన్ డాలర్లు)కు చేరాయి. యూపీఐ లావాదేవీ ద్వారానే ఈ మైలురాయిని చేరుకున్నట్లు ఫోన్ పే తెలిపింది. దేశంలోని చిన్నా, పెద్ద నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఇలా 99 శాతం పిన్‌కోడ్స్‌లో మూడున్నర కోట్ల మంది ఆఫ్‌లైన్ మర్చంట్స్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో తాము 50 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగి ఉన్నామని ఫోన్ పే ప్రకటించింది. తరువాత దశలో యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి సేవల ద్వారా మరింత వేగంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు ఫోన్ పే కన్జ్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర తెలిపారు. ఆర్బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కూడా పొందామని తెలిపారు. ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్‌లపై ఫోన్ పే భారీగా పెట్టుబడులు పెడుతోంది.