ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లేఖ రాశారు. తాను వాస్తవానికి జూన్ 26వ తేదీన ఇండియాకు రావాల్సి ఉంది కానీ అనారోగ్యం కారణంగా అమెరికాలోనే ఉండిపోయానన్నారు..
తాను క్యాన్సర్తో పాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తనపై పూర్తి అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చేయలేదని ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావు తెలిపారు.
.”జూన్ 26వ తేదీన ఇండియాకు వచ్చేది ఉండేది.. కానీ నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది. క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి చికిత్స చేయించుకుంటున్నాను. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తి అసత్యమైన ఆరోపణలు నాపై చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇండియాకు వచ్చే వరకూ టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను క్రమశిక్షణ గల ఒక పోలీసు అధికారిని. విచారణను ఎదుర్కొంటాను. ఎక్కడికీ తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్స్అప్ కాల్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను” అని ప్రభాకర్ రావు వెల్లడించారు.
.