రష్యాపై యుద్ధం మొదలైన తరువాత తొలిసారిగా రష్యా, ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రులు నేరుగా ఫోన్‌లో సంభాషించారు. యుద్ధం నేపథ్యంలో పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్, రష్యా రక్షణమంత్రి సెర్జి షోయ్‌గు చర్చించారు. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించింది. చర్చలు జరిగినంత మాత్రాన ఉక్రెయిన్‌పై తమ వైఖరి మారబోదని క్రెవ్లిున్ స్పష్టం చేసింది. కాగా ఉక్రెయిన్‌లో రష్యా మానవహక్కుల హననానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఐరాస మానవహక్కుల విభాగంలో చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉంది. గురువారం జరిగిన ఈ ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 33 దేశాలు నిలిచాయి. చైనా, ఎరిత్రియా వ్యతిరేకించగా భారత్, పాకిస్థాన్ సహా 12 దేశాలు తటస్థంగా వ్యవహరించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..