Thursday, November 28, 2024

PM Modi | ప్రధాని మోడీని బెదిరిస్తూ ఫోన్ కాల్

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేశామంటూ ఓ మహిళ బెదిరింపులకు పాల్పడింది. ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గురువారం ఓ బెదిరింపు కాల్ వచ్చింది.

అందులో ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు దుండగులు పేర్కొన్నారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ కాల్ ను ట్రాక్ చేయగా.. ఓ మహిళ (34) ఆ ఫోన్ చేసినట్లు గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement