హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం డీఎఫ్ఈ ఫార్మాకు చెందిన కొత్త కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఇవ్వాల (సోమవారం) ప్రారంభించారు. నగరంలోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటైన ఈ సెంటర్‌తో ఫార్మా సంస్థలకు లెక్కలేనన్ని ప్రయోజనాలు దక్కనున్నాయి. ఫార్మా రంగంలో సిటీకి చెందిన పలు కంపెనీలు ఫస్ట్ టైమ్ రైట్ ఔషధాలను ఉత్పత్తి చేయడం, వాటిపై పేటెంట్లు పొందడం వంటి విషయాల్లో డీఎఫ్ఈ ఫార్మా నూతన కేంద్రం తోడ్పాటును అందించనుంది.
క్లోజర్ టూ ద ఫార్ములేషన్ ప్రాతిపాదికగా ఈ కేంద్రం పని చేయనుంది. తెలంగాణలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈమధ్య మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో డీఎఫ్ఈ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.