హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ పీజీఈసెట్)-2023 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ వర్సిటీలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, విద్యామండలి వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్‌రావు విడుదల చేయనున్నారు.
2023-24 విద్యాసంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్ ద్వారా ప్రవేశాలను చేపట్టనున్నారు. మే 29 నుంచి జూన్ 1 వరకు టీఎస్ పీజీఈసెట్ సీబీటీ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే.