Saturday, November 23, 2024

కొవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి తగ్గుతున్న యాంటీ బాడీలు

కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి ముఖ్య గమనిక. ఫైజర్ లేదా ఆస్ట్రాజెన్‌కా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మూడు నెలల తర్వాత యాంటీబాడీల క్షీణత ఉంటుందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న 10 వారాల తర్వాత 50% యాంటీబాడీలు క్షీణిస్తున్నట్లు యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు గుర్తించారు. ఇలా జరిగితే కొత్త వేరియంట్లను అడ్డుకోలేమన్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నా మొదట్లో మాత్రం అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు.

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 21 నుంచి 40 రోజుల మధ్య 7,506 u/ml (యూనిట్స్ ఫర్ మిల్లీమీటర్) ఉన్న యాంటీబాడీలు 70 రోజులకు 3,320 u/mlగా నమోదవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న వారిలో 0 నుంచి 20 రోజుల మధ్య 1,201 u/ml (యూనిట్స్ ఫర్ మిల్లీమీటర్) ఉన్న యాంటీబాడీలు 70 రోజులకు 190 u/mlగా నమోదవుతున్నాయని తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: కడప జిల్లాలో భగుమన్న ముఠా కక్షలు.. సర్పంచ్ దారుణహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement