Tuesday, November 26, 2024

5 ఏళ్ల లోపు పిల్లలకు ఫైజర్‌ 3 కొవిడ్‌ షాట్లు..

కొవిడ్‌ మూడు షాట్లు ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని ఫైజర్‌ కంపెనీ ప్రకటించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయడానికి నెలల తరబడి ఆత్రుతగాఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫైజర్‌ ఈ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్‌-19 కేసులు మరోసారి పెరుగుతున్న దృష్ట్యా ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ కొవిడ్‌ -19 బూస్టర్‌ వ్యాక్సిన్‌ని అందజేస్తున్ననారు. ఫైజర్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ యొక్క మూడు మోతాదులు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు బలమైన రక్షణను అందిస్తాయని కంపెనీ తెలిపింది.

అమెరికాలో ఐదేళ్ల లోపు వయసున్న 18 మిలియన్ల మంది పిల్లలు మాత్రమే కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు అర్హత పొందలేదు. ” రాబోయే నెలల్లో తమ చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాలని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కొత్త ఫైజర్‌ టీకాలు సానుకూలంగా ఉంటాయి” అని జాన్స్‌ హాప్‌ కిన్స్‌ బ్లూమ్‌ బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌కు చెందిన డాక్టర్‌ విలియం మోస్‌ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement