Wednesday, November 20, 2024

ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు.. కుప్పంలో పెట్రోల్ ధర రూ.110

ఏపీలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కలా ధరలు ఉన్నాయి. విశాఖలో లీటరు పెట్రోలు ధర రూ. 106.80 ఉంటే, విజయవాడలో రూ.107.63గా ఉంది. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు ధర రూ. 110గా ఉంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు ధర రూ. 108.92గా ఉంటే డీజిల్‌ను రూ.100.39కి విక్రయిస్తున్నారు. ఒక్క పెట్రోలే కాదు, వంట గ్యాస్ ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసమే ఉంది. విశాఖలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 841గా ఉంటే, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 904గా ఉంది.

కాగా పెట్రోల్ నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణా ఛార్జీలే ధరల్లో తేడాలకు కారణమని చమురు సమస్థలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒకే నగరంలోనూ ధరల్లో వ్యత్యాసం ఉండడం గమనార్హం. గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి, ఆ పక్కనే ఉన్న విజయవాడకు మధ్య పెట్రో ధరల్లో లీటరుకు 20 పైసల వరకు వ్యత్యాసం ఉండగా, విజయవాడలోని భవానీపురంలో ఒకలా, బెంజిసర్కిల్‌లో మరోలా ధరలు ఉన్నాయి.

ఈ వార్త కూడా చదవండి: రూ.2 లక్షలను కొరికేసిన ఎలుకలు

Advertisement

తాజా వార్తలు

Advertisement