దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపడుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటిపోయింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏకంగా రూ.110 చేరువలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ. 108.78గా ఉంది. గతంలో పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై ఉన్న 31 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా.. దాన్ని 35.20 శాతానికి పెంచారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా దాన్ని 27 శాతానికి పెంచారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిగత రాష్ట్రాలతో పొలిస్తే.. ఏపీలోనే చమరు ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ- తమిళనాడు సరిహద్దులో ఓ ప్లెక్సీ వెలిసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఉన్న పెట్రోల్ ధరల పటికను ఏర్పాటు చేశారు. ఏపీలో పెట్రోల్ ధర రూ.108.78 ఉండగా.. తమిళనాడులో రూ.100.89 ఉంది. ఇరు రాష్ట్రాల మద్య తేడా రూ.7.89 విత్యాసం ఉంది. ఆంధ్ర కంటే తమ రాష్ట్రంలోనే పెట్రోల్ ధర చాలా తక్కువగా ఉందని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ ధరల పట్టిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ఉన్న వాహనదారులు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకుంటున్నారు. కాగా, ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్ పై విధిస్తున్న పన్నును తగ్గించింది. ఫలితంగా దాదాపు రూ.3 మేర ధర తగ్గింది.