వాహనదారులకు గుడ్ న్యూస్. ఏడాది కాలంగా అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తొలిసారిగా కాస్త తగ్గాయి. గతేడాది మార్చి 16 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఏడాది కాలంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 తగ్గింది. నిన్న లీటర్ పెట్రోల్ 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నవేళ రానున్న రోజుల్లో పెట్రోలు ధరులు మరి కొంత తగ్గవచ్చని వాహనదారులు భావిస్తున్నారు.
ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పెట్రోలు ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.99 నుంచి రూ. 90.78కు తగ్గగా, డీజిల్ ధర రూ. 81.30 నుండి రూ. 81.10కు తగ్గింది. ఇతర నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో పెట్రోలు రూ. 97.19కు, డీజిల్ రూ. 88.20కు చేరగా, చెన్నైలో పెట్రోల్ రూ. 92.77, డీజిల్ రూ. 86.10కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 94.39గా ఉండగా, డీజిల్ ధర రూ.88.45కు తగ్గింది.