దేశంలో చమరు ధరలకు బ్రేకులు పడడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.79కు చేరగా, డీజిల్ ధర రూ.93.52కు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌పై 34 పైసలు పెరగడంతో రూ.110.75కు, డీజిల్‌పై 37 పైసలు అధికమవడంతో రూ.101.40కు చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు పెరిగి రూ.109కి చేరిగా.. డీజిల్‌పై 38 పైసలు పెరిగి డీజిల్ రూ.102.04కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ.102.10, డీజిల్ రూ.97.93, కోల్‌కతాలో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ.96.63, బెంగళూరులో పెట్రోల్ రూ.108.44, డీజిల్ రూ.99.26కు చేరాయి.
ఇది కూడా చదవండి: