Tuesday, November 26, 2024

తగ్గేదే లే: రెండో రోజూ పెట్రో మోత!

దేశంలో మళ్లీ పెట్రో బాదుడు ప్రారంభమైంది. వరుసగా రెండో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, డీజిల్ ధర లీటర్​కు​ 21 పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముండి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. తాజాగా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.80, లీటర్​ డీజిల్​ ధర రూ.81.18కు చేరింది. ఇక హైదరాబాద్లో పెట్రోల్  ధర రూ.94.38, డీజిల్ ధర రూ.88.50, ముంబైలో పెట్రోల్ ధర రూ.97.16, డీజిల్ ధర రూ.88.22గా ఉంది.

కాగా, దేశంలో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 16 పైసలు పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement