దేశంలో చమురు ధరల పెరుగుదలపై ప్రజలు మండి పడుతున్నారు. లీటరు పెట్రోలు వంద రూపాయలు దాటడంతో వాహనదారుల ఆగ్రహం, అసహం వ్యక్తం చేస్తున్నారు…కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మోదీ ఫ్లెక్సీ కి ప్రజలు దండం పెడుతున్న ఫోటోలు ఎప్పుడు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది… #ThankYouModiJiChallenge పేరుతో ఈ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ నడుస్తోందిప్పుడు. అయితే ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు ఇలా మోదీ ఫోటో దండం పెట్టి తమ నిరసనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
ఈ ట్రెండ్ ఎలా మొదలైంది అనేది స్పష్టత లేదుగానీ, చాలా మంది ఈ ఛాలెంజ్ పాల్గొంటున్నారు. యూపీఏ పాలనలో మోదీ చేసిన ట్వీట్లను తెరపైకి తెస్తూ.. ఏడేళ్ల పాలనలో ధరల పెంపును ప్రస్తావిస్తూ ఫన్నీ మీమ్స్‌తో మరికొందరు ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ తమ విమర్శలకు ఈ ట్రెండ్‌ను వాడేసుకుంటోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టడం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ కొనసాగిస్తున్న ఈ నెగెటివ్ ట్రెండ్‌ను పాజిటివ్‌గా మార్చేచే ప్రయత్నం చేస్తున్నారు మోదీ మద్ధతుదారులు. ఇక ఈరోజు పెట్రో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.. మొత్తం మెట్రో నగరాల్లో ముంబైలో గరిష్టంగా పెట్రోల్ లీటర్ ధర రూ.107.83 కాగా, డీజిల్ ధర రూ.97.45గా ఉంది.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది.
ఇది కూడా చదవండి : మహిళలు, దళితులు మంత్రులవడం కొంతమందికి నచ్చడం లేదు: ప్రధాని మోదీ..