సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించాయి.అదేవిధంగా డీజిల్‌పై 18 పైసలు కోతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్ 96.64, చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్ 93.66, కోల్‌కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్ 92.13, బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్ 94.49గా ఉన్నాయి. ఇక తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69, డీజిల్ రూ.97.15కి తగ్గాయి.
ఇది కూడా చదవండి: చైనా చేస్తున్న పని వల్ల పురుషుల్లో అంగం సైజు తగ్గుతోందట..