Thursday, November 21, 2024

మేలో పెరిగిన పెట్రోల్‌, డీజెల్‌ విక్రయాలు.. తొలి 15 రోజుల్లో భారీగా సేల్స్‌

భారత్‌లో పెట్రోల్‌, డీజెల్‌ వాడకం మేలో భారీగా పెరిగింది. హార్వెస్టింగ్‌ సీజన్‌తో పాటు ఆర్థికపరమైన కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇంధన వినియోంగం మేలో పెరిగింది. ఇంధన పరిశ్రమ మునుపటి డిమాండ్‌ను అందుకుందని ఆయిల్‌ రంగ కంపెనీలు సోమవారం తెలిపాయి. ఏప్రిల్‌లోని తొలి 15 రోజులతో పోలిస్తే.. మేలోని తొలి 15 రోజుల్లో పెట్రోల్‌ అమ్మకాలు 14 శాతం వృద్ధి చెందాయి. అదేవిధంగా డీజెల్‌ డిమాండ్‌ 1.8 శాతానికి పెరిగింది. కుకింగ్‌ గ్యాస్‌ ఎల్‌పీజీ వినియోగం మే 1-15 మధ్య 2.8 శాతం పెరిగింది. అధిక ధరల కారణంగా గత నెలలో వినియోగం పడిపోయినా.. మేలో మాత్రం పెరిగింది. ప్రభుత్వ రంగ రిటైల్‌ విక్రయ కేంద్రాల్లో 1.28 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ విక్రయించారు. క్రితం ఏడాదిలో ఇదే సమయంతో పోలిస్తే.. 59.70 శాతం అధికం. ఏప్రిల్‌ 1-15 మధ్య 1.12 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

క్రితం ఏడాదితో పోలిస్తే.. 37శాతం అధికం..

డీజెల్‌ విక్రయాలు క్రితం ఏడాదితో పోలిస్తే.. మే తొలి 15 రోజుల్లో 37.8 శాతం పెరిగి.. 3.05 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. గత నెల ఇదే సమయంలో 2.99 మిలియన్‌ టన్నులు అమ్ముడుపోయింది. 1.8 శాతం అధికంగా విక్రయాలు జరిగాయి. ప్రజలకు ఇంధనం అనివార్యమైందని, ధరతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేపడుతున్నారని ఆయిల్‌ రంగ కంపెనీలు వెల్లడించాయి. వంట గ్యాస్‌ పరంగా.. ఏప్రిల్‌లో పడిపోయిన విక్రయాలు.. మే తొలి 15 రోజుల్లో 2.8 శాతం పుంజుకుని 1.02 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. క్రితం ఏడాదితో పోలిస్తే.. విక్రయాలు 5.4 శాతం క్షీణించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement